రూ.459 కోట్లు సేకరించిన సెన్కో

న్యూఢిల్లీ : జ్యుయెలరీ రిటైల్ చెయిన్ సెన్కో గోల్డ్‌ లిమిటెడ్‌ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) మార్గంలో రూ.459 కోట్లు సేకరించింది. 40.8 లక్షల షేర్లను షేరుకి రూ. 1,125 వద్ద అమ్మింది. ఈ ఇష్యూ  తర్వాత సెన్కో గోల్డ్‌  పెయిడప్ క్యాపిటల్‌ రూ.81.80 కోట్లకు చేరుకుంది.

ఇష్యూ సైజ్‌లో  14.49 శాతం వాటాను టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయగా, టాటా మల్టీక్యాప్ ఫండ్ 8.77 శాతం వాటాను కొనుగోలు చేసింది.