మొదలైన హోండా, నిస్సాన్ విలీన పనులు

  • విలీన సంస్థకు సబ్సిడరీలుగా కొనసాగనున్న ఇరు కంపెనీలు

న్యూఢిల్లీ: జపనీస్‌‌‌‌‌‌‌‌ ఆటోమోటివ్ కంపెనీలు హోండా, నిస్సాన్‌‌‌‌‌‌‌‌లు విలీనం కావడానికి   సోమవారం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. చర్చలు స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, ప్లాన్ ఇంకా రెడీ కాలేదని తెలిపాయి.  విలీనం తర్వాత కూడా హోండా, నిస్సాన్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్లు సపరేట్‌‌‌‌‌‌‌‌గా అందుబాటులో ఉంటాయి. విలీన సంస్థకు ఈ రెండు కంపెనీలు సబ్సిడరీలుగా మారతాయి. విలీన సంస్థ సపరేట్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌తో బండ్లను తీసుకొస్తుంది. ఈ జాయింట్ హోల్డింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీని 2026 లో టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ చేయనున్నారు. 

హోండా, నిస్సాన్‌‌‌‌‌‌‌‌ల టెక్నాలజీ, రిసోర్స్‌‌‌‌‌‌‌‌లు, ఉద్యోగులను ఒకచోటికి తీసుకొచ్చి ఆటో ఇండస్ట్రీలోని సమస్యలను అధిగమిస్తాం’ అని హోండా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొషిహిరో మిబె పేర్కొన్నారు. వచ్చే నెల చివరి నాటికి విలీనానికి సంబంధించిన ఫైనాన్షియల్ వివరాలను బయట పెడతామన్నారు.  కస్టమర్లకు కొత్త ఫైనాన్షియల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను కూడా అందిస్తామన్నారు. కాగా, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నడిచే బండ్లను మరింతగా డెవలప్ చేసేందుకు ఈ రెండు కంపెనీలు కలిసి రీసెర్చ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో ఎంఓయూ కుదుర్చుకున్నాయి.