మందు కొట్టి డయల్ 100కి ఫోన్ చేసిన వ్యక్తికి జైలు

జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్ పల్లి చెందిన కోమటి రాజు అనే వ్యక్తి గతంలో మద్యం మత్తులో డయల్ 100కి పలుమార్లు ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేశాడు. దీంతో పోలీసులు రాజుపై కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి రవి.. నిందితుడు రాజుకు 7 రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు జైపూర్ ఎస్​ఐ శ్రీధర్ తెలిపారు.