ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలి : ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించకపోవడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు పోలీసులతో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే 44  బ్లాక్ స్పాట్స్ గుర్తించామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణపై  దృష్టి పెడతామన్నారు. అనంతరం పలువురు వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ  వేణుగోపాల్, ఎస్ఐ లు తిరుపతి, సుధీర్ రావు, ట్రాఫిక్ ఎస్ఐలు  రామచంద్ర౦, మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.