- నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన
భైంసా, వెలుగు: ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేసే చర్యలు చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భైంసాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుదీర్ఘం కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పని భారాలు తగ్గించడంతో పాటు వెల్ఫేర్ కమిటిలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించి, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ నాయకులు గంగయ్య, స్వరూప్, కుంటాల ముత్యం, బాబు, సుధాకర్, ఎల్ఎస్గౌడ్, నిరోష, కళ తదిత రులు పాల్గొన్నారు.