ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలి

  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి 

బెజ్జంకి, వెలుగు:  ప్రభుత్వాలపై ప్రజల తరఫున పోరాటం చేసేది సీపీఐ పార్టీనే అని జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం బెజ్జంకిలో పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ధనవంతులు ఎదిగిపోతున్నారని, పేదలు నిరుపేదలనుగానే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ తో రైతులు  ఎంతో గోసపడ్డారన్నారు.  

ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలు తొలగిపోతాయని స్వాగతిస్తున్నామ న్నారు. గుగ్గిళ్ల తిమ్మాయపల్లి, పోతర నరసింహపల్లిలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలిపారు. గ్రామసభ నిర్వహించకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నార న్నారు. భవిష్యత్ లో 10 గ్రామాలు పొల్యూషన్, పర్యావరణంతో దెబ్బతింటాయన్నారు.  

రెండు ఫ్యాక్టరీ రద్దు చేయాలని లేకుంటే ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి మంద పవన్, మండల కార్యదర్శి భువనగిరి రూపేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు సంగం మధు కార్యదర్శి జేరిపోతుల దొంతలేని మహేశ్​ఉన్నారు.