ఐటీడీఏ పరిధిలోని స్కూళ్ల పరిశీలించేందుకు ఉట్నూర్ ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లారు. మంగళవారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని వెల్గి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు.
దారిలో వాగుల దగ్గర వాహనం దాటేలా లేకపోవడంతో ఎడ్ల బండిలో కూర్చుని వెళ్లారు. స్కూల్స్ కు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు.
- వెలుగు, ఆసిఫాబాద్