విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించాలి

  • స్కూళ్లను, హాస్టళ్లను తనిఖీ చేసిన అధికారులు

నేరడిగొండ, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ఆశ్రమ హై స్కూల్ ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు . స్కూల్ లోని స్టోర్ రూమ్ లో సన్న బియ్యం,  కోడిగుడ్లను పరిశీలించారు . విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించాలని, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని  ఆదేశించారు. 

గుడిహత్నూర్ : విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు . గుడిహత్నూర్ మండలంలోని ఉమ్రి (బీ) గ్రామంలో  గిరిజన బాలికల ఆశ్రమ హైస్కూల్ ను బుధవారం   ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసులో చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు . ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కవితా రెడ్డి , ఎంపీడీవో అబ్దుల్ హైమద్, ఎంఈఓ ఉదయ్ రావు పాల్గొన్నారు .

 విద్యార్థుల ఆరోగ్యం నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని , నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. 

కాగ జ్ నగర్ : కాగ జ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా బెజ్జూర్ మండలం లో పర్యటించారు. కేజీబీవీ,ఆశ్రమ పాఠశాలలను సందర్శించి వంటగదులను,  గదులను పరిశీలించారు. బారేగుడా, బెజ్జుర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి , రైతులకు ఎలాంటి  నష్టం జరగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.