అసైన్డ్‌‌‌‌‌‌‌‌ భూమి ఎవరి చేతుల్లోకి పోయిందో తేల్చాలి: ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉండే దని, ఇప్పుడు 5 లక్షల ఎకరాలు మాత్రమే ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం స్కామ్‌‌‌‌‌‌‌‌ను సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ విదేశీ కంపెనీ అధీనంలో ఉందని, దీనిపై ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదో చెప్పాలని సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిమాండ్ చేశారు. ధరణి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని నిలదీశారు.