ఐటీ జాబ్స్ కోసం కోర్సులు నేర్చుకుంటున్న యువతకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: ఐటీ నియామకాలు వచ్చే ఏడాది పెరుగుతాయని  హెచ్‌‌ఈర్ కంపెనీ ఎన్‌‌ఎల్‌‌బీ సర్వీసెస్ పేర్కొంది. ఐటీ ఇండస్ట్రీ రికవరీ బాటలో ఉందని, ఈ ఇండస్ట్రీలో నియామకాలు 15–20 శాతం పెరుగుతాయని తెలిపింది. ‘ఇండియా ఐటీ సెక్టార్‌‌‌‌లో ఫ్రెషర్ల నియామకాలు ఊపందుకుంటాయి. అన్ని సెగ్మెంట్లలో హైరింగ్ యాక్టివిటీ 15–20 శాతం పెరుగుతుందని అంచనా’ అని ఎన్‌‌ఎల్‌‌బీ సర్వీసెస్ వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌, మెషిన్ లెర్నింగ్‌‌, డేటా ఎనలిటిక్స్‌‌, క్లౌడ్ టెక్నాలజీస్ వంటి స్పెషలైజ్డ్‌‌ టెక్ జాబ్‌‌లకు గిరాకీ బాగుందని, ఈ జాబ్ రోల్స్ కోసం నియామకాలు 30–35 శాతం పెరుగుతాయని అంచనా వేసింది.

 ‘ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల స్కిల్స్‌‌ పెంచడానికి భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పెద్ద కంపెనీలు  క్యాంపస్ హైరింగ్‌‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల్లో భారీగా నియామకాలు చేపడతాయి’ అని ఎన్‌‌ఎల్‌‌బీ సర్వీసెస్ అంచనావేసింది. సైబర్ సెక్యూరిటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, మాన్యుఫాక్చరింగ్‌‌, ఫైనాన్షియల్, హెల్త్‌‌కేర్‌‌‌‌, రిటైల్ సెక్టార్లలో ఐటీ ఫ్రెషర్ల నియామకాలు వచ్చే ఏడాది 30–35 శాతం పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కాగా, 2021–22 నుంచి గ్లోబల్  ఎకానమీ నెమ్మదించింది. ఇప్పుడిప్పుడే సాధాణ స్థాయికి చేరుకుంటోంది.