హైదరాబాద్‌‌ బ్రాండ్‌‌ ఇమేజ్‌‌ను కాపాడుతాం

  • ఎవరు తెలివి తక్కువ వారో ప్రజలకు తెలుసు
  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు

మంథని, వెలుగు : హైదరాబాద్‌‌ బ్రాండ్‌‌ ఇమేజ్‌‌ను కాపాడేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డితో పాటు మంత్రులమంతా కృషి చేస్తున్నామని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు చెప్పారు. మంథని పట్టణంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌‌లో చేపట్టిన పనుల వల్ల కాంగ్రెస్‌‌కు పేరొస్తుందన్న అసూయతోనే బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి హైదరాబాద్‌‌తో పాటు తెలంగాణ అభివృద్ధికి ముందుకు సాగుతున్నామని చెప్పారు.

బీఆర్‌‌ఎస్‌‌లో ఉన్న అంతర్గత సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని సూచించారు. తెలివి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజలంతా తెలంగాణవాదులేనని, అందరినీ గౌరవించే ముందుకు సాగుతున్నామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్‌‌ రమ, కాంగ్రెస్‌‌ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఉన్నారు.