ఊరుమందమర్రి చెరువులో జాయింట్ ​సర్వే : చెరువు శిఖం కబ్జాలపై ఫిర్యాదుల నేపథ్యంలో..

  • చెరువు శిఖం కబ్జాలపై ఫిర్యాదుల నేపథ్యంలో..

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరుమందమర్రి చెరువు పరిసరాల్లో ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు శుక్రవారం జాయింట్​సర్వే చేపట్టారు. చెరువు శిఖం కబ్జాకు గురయ్యిందని ఫిర్యాదులు రావడంతో కలెక్టర్​ కుమార్ ​దీపక్ ఆదేశాలతో ఆఫీసర్లు చెరువు ఎఫ్​టీఎల్​ కెపాసిటీ, బఫర్ ​జోన్, సరిహద్దులు, పరిధి, ప్రభుత్వ భూములపై సర్వే చేశారు. సర్వే చేసి నివేదికలను కలెక్టర్​కు అందజేస్తామని ఆఫీసర్లు పేర్కొన్నారు. ఇరిగేషన్​డీఈ శారద, ఏఈ రమ్య, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​రాథోడ్​ గణపతి, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాల తొలగింపు

మందమర్రి మార్కెట్​ఏరియా డిష్​లైన్​లో డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ ​సిబ్బంది శుక్రవారం జేసీబీ, ట్రాక్టర్​ సహాయంతో తొలగించారు.