స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్‌‌తో ఐక్యూ 13

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూ డిసెంబర్ 3న ఐక్యూ 13 ఫోన్​ను లాంచ్ చేయనుంది. ఇందులో కొత్త స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2కే డిస్​ప్లే, వెనుక ట్రిపుల్​ కెమెరా సెటప్​, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 120వాట్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఐక్యూ13 స్మార్ట్ ఫోన్ 0.813 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. 12జీబీ వరకు ర్యామ్, 512 జీబీ స్టోరేజీ​లభిస్తుంది. దీనిని వచ్చే నెల మూడో తేదీన లాంచ్​ చేస్తామని కంపెనీ ప్రకటించింది.