IKS IPO అప్లై చేస్తున్నారా.. లాభం ఎంత రావచ్చు..?

హైద్రాబాద్, వెలుగు: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నా.. ఐపీవో మార్కెట్ లో జోష్ తగ్గడం లేదు. కంపెనీలు వరుసగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. విషాల్ మెగామార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ తదితర కంపెనీల ఆఫర్ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు తాజాగా IKS (Inventurus Knowledge Solutions) ఐపీఓ ఇవాళ ( డిసెంబర్ 12, 2024) ఓపెన్ అవుతోంది. 

వైద్యరంగంలో (Healthcare enterprises) సేవలు అందించే ఈ కంపెనీ వివిధ హాస్పిటల్స్ లో అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ విషయంలో పనిచేస్తుంది. ముఖ్యంగా కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాల మార్కెట్లను కాప్చర్ చేయడంలో ఈ కంపెనీ ఫోకస్ పెట్టింది.  ఈ IKS IPO ప్రైస్ బ్యాండ్ ధర రూ.1265 నుంచి రూ.1365 వరకు ఉంది. ఒక లాట్ లో 11 షేర్లు గా ఉన్న ఈ ఐపీఓ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.14,619గా డిసైడ్ చేశారు. డిసెంబర్ 12 న ఓపెన్ అవుతున్న ఈ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ 16న ముగుస్తుంది. డిసెంబర్ 19 బీఎస్ఈ(BSE), ఎన్ఎస్ఈ(NSE) రెండింటిలో లిస్ట్ అవుతుంది. 

  • గ్రేమార్కెట్ ప్రీమియం ఎంతంటే..

గ్రే మార్కెట్ లో ఈ కంపెనీకి కొంత డిమాండ్ ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కంపెనీ ఒక్క షేర్ కు గ్రేమార్కెట్ లో సుమారు రూ.350 గా డిమాండ్ ఉన్నట్లు అంచనా ఉంది. అంటే లిస్టింగ్ గెయిన్స్ 30 శాతం వరకు రావచ్చని అనలిస్టులు చెబుతున్నారు. అప్లై చేసే ముందు మీ అడ్వైజర్ సలహా తీసుకోగలరు. రిటైల్ ఇన్వెస్టర్లకు కేవలం 10 శాతం కోటా మాత్రమే ఆఫర్ చేస్తుండటంతో ఈ ఐపీఓ ఎలాట్ కావడం కొంచెం కష్టమే ఉండొచ్చు.