టీజీఎఫ్​డీసీ సంస్థకు ఇంటర్నేషనల్​ సర్టిఫికెట్

కోల్​బెల్ట్, వెలుగు: తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్ డీసీ) కాగజ్ నగర్ డివిజన్​కు ఇంటర్నేషనల్​ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ (ఎఫ్ఎస్​సీ) సర్టిఫికెట్ ప్రకటించింది. ఈ సర్టిఫికెట్​ను సీఎం రేవంత్ ​రెడ్డి చేతుల మీదుగా సంస్థ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి అందుకున్నారని బుధవారం టీజీఎఫ్​డీసీ అధికారులు తెలిపారు. కాగజ్​నగర్​ డివిజన్ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ రేంజ్​లలోని నీలగిరి ప్లాంటేషన్ పనుల్లో చేపడుతున్న భద్రతా ప్రమాణాలు, అందిస్తున్న నాణ్యమైన సేవలను గుర్తించి నెదర్లాండ్స్ దేశానికి చెందిన కంట్రోలర్ యూనియన్ సర్టిఫికేషన్ సంస్థ ఈ సర్టిఫికెట్ ప్రకటించినట్లు పేర్కొన్నారు.

దేశ, విదేశాల్లో ఉన్న కలప ఆధారిత సంస్థల్లో చేపడుతున్న పనులను పరిశీలించి ఎఫ్ఎస్​సీ ఈ సర్టిఫికెట్​ను ప్రకటిస్తుంది. ఇంటర్నేషనల్​ ​సర్టిఫికెట్ ప్రకటించడం పట్ల టీజీఎఫ్ డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి, మంచిర్యాల, కాగజ్ నగర్, బెల్లంపల్లి రేంజ్​ల ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేశ్ కుమార్, లక్ష్మణ్, సునీత తదితరులు కృతజ్ఞతలు 
తెలిపారు.