
- 19 వేల క్వింటాళ్లకు పైగా వడ్లు మాయమైనట్లు గుర్తింపు
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలంలోని రెండు రైస్ మిల్లుల నుంచి లారీల్లో సీఎంఆర్ వడ్లను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం డీఎస్ఓ శ్రీనాథ్ ఆధ్వర్యంలో మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు.
కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్ లో 12 వేల క్వింటాళ్ల సీఎంఆర్ వడ్లను ప్రభుత్వం అప్పగించగా, ఇందులో 8,731 క్వింటాళ్లు తరలించినట్టు అధికారుల విచారణలో తేలింది. సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో 23,418 క్వింటాళ్లు కేటాయించగా.. 10,710 క్వింటాళ్ల వడ్లు మాయమైనట్లు గుర్తించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు, సివిల్ సప్లై కమిషనర్‌కు అందజేస్తామని డీఎస్వో తెలిపారు.