మెదక్టౌన్, వెలుగు : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న రిలయన్స్ సూపర్ స్టోర్లో పాడై పోయిన పండ్లు అమ్ముతున్నారని సోమవారం కస్టమర్ప్రవీణ్ ఫిర్యాదు మేరకు మెదక్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్మహేశ్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ స్టోర్కు వెళ్లి తనిఖీలు నిర్వహించగా పాడైపోయిన పండ్లు, గింజలు ఉండడం గమనించారు.
దీంతో పండ్లను డంపింగ్ యార్డుకు తరలించి రూ.10 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో మున్సిపల్శానిటరీ జవాన్లు శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు నాగేంద్రబాబు, దౌలయ్య, మహబూబ్ పాల్గొన్నారు.