మెదక్ టౌన్, వెలుగు : మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్లో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌కాలేజ్, హాస్పిటల్‌ను సోమవారం జాతీయ వైద్య కమిషన్ సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలేజీ, హాస్పిటల్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కాలేజ్అక్రిడిటేషన్ , రిజిస్ట్రేషన్, మౌలిక సదుపాయాలు పరిశీలించారు. 2024,-20-25 సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక తయారుచేసుకోవాలని సూచించారు.
కమిషన్ సభ్యులు దాస్, కుశ్నూర్ షేఖ్, సుష్మా కుషాల్ కటారియా, కలెక్టర్ రాహుల్‌రాజ్, కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్ కుమార్, కృష్ణారెడ్డి, చంద్ర శేఖర్, ఏఈ మహేశ్ పాల్గొన్నారు.