న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి బెంగళూరులో రూ.50 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్ కొన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. పాపులర్ కింగ్‌ఫిషర్ టవర్స్‌లో 16 వ అంతస్తులో ఈ 4 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ ఉందని, 8,400 చదరపు అడుగుల్లో విస్తరించిందని వెల్లడించింది. ఒక్కో చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని పేర్కొంది.
2010 లో కింగ్‌ఫిషర్ టవర్స్ నిర్మాణం పూర్తవగా, అప్పుడు ఒక్కో చదరపు అడుగు రూ.22 వేలు మాత్రమే పలికింది. నారాయణ మూర్తి ముంబై బిజినెస్ మ్యాన్ నుంచి ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. సాధ్వానీ రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ అపార్ట్‌మెంట్ ఓనర్‌షిప్ ట్రాన్‌ఫర్‌ను చేపట్టింది. కాగా, కింగ్‌ఫిషర్ టవర్స్ బెంగళూరులోని ప్రైమ్ ఏరియా యూబీ సిటీలో ఉంది. వీటిలో 81 లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. మొత్తం 34 అంతస్తుల్లో, 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.