భారత దేశ ఎగుమతులు 4.85 శాతం తగ్గినయ్

న్యూఢిల్లీ:  మనదేశ సరుకు ఎగుమతులు ప్రస్తుత సంవత్సరం నవంబర్‌‌లో వార్షికంగా 4.85 శాతం తగ్గి 32.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత నవంబరులో 33.75 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. ఈ  నవంబర్‌‌లో దిగుమతులు 27 శాతం పెరిగి 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి.  

నవంబర్‌‌లో బంగారం దిగుమతులు 14.8 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.    వాణిజ్య లోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా)  37.84 బిలియన్ డాలర్లకు పెరిగింది.  ఈ ఏడాది అక్టోబర్‌‌లో మనదేశ సరుకుల ఎగుమతులు 17.25 శాతం పెరిగి 39.2 బిలియన్‌‌ డాలర్లకు చేరుకున్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-–నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర ప్రభుత్వ డేటా వెల్లడించింది.