మన దేశంలో మధ్య తరగతి చితికిపోతుంది.. కరిగిపోతుంది : RBI సంచలన నివేదిక

ఒకప్పుడు అభివృద్ది పథంలో ఉన్న మిడిల్ క్లాస్ ప్రజల పరిస్థితి ఇప్పుడు చిక్కుల్లో పడింది..దేశంలో మధ్య తరగతి ప్రజలు ఆర్థిక సమస్యలతో  చితికిపోతుంది. ఉద్యోగ, ఉపాధి తగ్గింది.. పొదుపు లేదు.. కొనుగోలు శక్తి తగ్గింది..ఎంతలా అంటే వారి కనీస అవసరాలు తీర్చుకోలేనంతగా.. ప్రస్తుతం వారి ఆర్థిక పరిస్థితి కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. 

టెక్నాలజీ ,ఆర్థిక మాంద్యం ఆటుపోట్లు, క్షీణిస్తున్న హౌజ్ హోల్డ్ బ్యాలెన్స్ షీట్.. ఇలా చాలా కారణాలు మధ్య తరగతి ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు మధ్య తరగతి వారికి ఉపాధి, ఉద్యోగం అంటే సులభంగానే దొరికేదట.. కానీ ఇప్పుడు వాటిలోకి కూడా పోటీ పెరిగింది. టెక్నాలజీ ప్రభావం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో క్లరికల్, సూపర్ వైజర్ వంటి పోస్టులు  కూడా దొరికే పరిస్థితి లేదట.

కోవిడ్ తర్వాత ఇండియాలో అభివృద్ది వేగంగా మందగించింది. ఆర్థిక వ్యవస్థను తిరుగు ముఖం పట్టించింది. 2025 రెండో క్వార్టర్స్ కార్పొరేట్ ఎర్నింగ్స్..రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. ఒకరకంగా  చెప్పాలంటే 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం లాగా. స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఇది సాధారణమే అయినప్పటికీ మధ్యతరగతిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వినియోగ శక్తిని తగ్గిస్తుంది.

మధ్యతరగతి ప్రజల్లో పొదుపు కూడా గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం.. జీడీపీలో నికర గృహ పొదుపుల వాటా 50యేళ్ల కనిష్టానికి దిగజారింది. స్థూల పొదుపులు స్థిరంగా ఉన్నప్పటికీ, అన్ సెక్యూర్డ్ లోన్స్ బాగా పెరిగాయట. 

మధ్యతరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి దారుణంగా క్షీణించిందని రిపోర్టు చెబుతున్నాయి. ఆహారం, పానీయాల కొనుగోలు ఎక్కువ శాతం వాటా ఉన్న మధ్యతరగతి ప్రజలను వినియోగం గణనీయంగా తగ్గిందని FMCG అమ్మకాలు చెబుతున్నాయి. FMCG అమ్మకాలలో మూడింట రెండు వంతుల వాటా పట్టణ మధ్యతరగతి చేత ప్రభావితమై ఉంటుంది. 

పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలతో  మధ్య తరగతి ప్రజలు గతంలో లాగా ఖర్చు చేయలేకపోతున్నారని చెబుతున్నాయి. అందుకే డబుల్ డిజిట్ పర్సెంటేజ్ ఉన్న సేల్స్ ఇప్పుడు కేవలం 1.5 శాతం నుంచి 2 శాతానికి పడిపోయాయని చెబుతున్నాయి.  

మధ్యతరగతి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గాయని కార్పొరేట్ కంపెనీలు చెబుతున్నాయి. ఆటోమేషన్, అవుట్ సోర్సింగ్ లలో కాస్ట్ కట్టింగ్ పేరుతో చాలా రకాల మేనేజర్ల పోస్టులు కనిపించకుండా పోతున్నాయని గుర్తించనట్లు నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ మాజీ చైర్మన్ పీసీ మోహనన్  చెబుతున్నారు. విప్రో చైర్మన్ రిషబ్ ప్రేమ్ జీ కూడా ఇదే చెబుతున్నారు. ఈ ఉద్యోగాల తగ్గుదలలో ఏఐ ప్రవేశం చాలా ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వైట్ కాలర్ జాబ్ అనేవి ఉండవని.. ఇవన్నీ ఏఐ తో భర్తీ చేయబడతాయని చెబుతున్నారు. 

రాబోయే త్రైమాసికాల్లో కూడా ఇదే హెచ్చు తగ్గుల ఆర్థిక పరిస్థితి కొనసాగవచ్చు.. టెక్నాలజీ ఎఫెక్ట్, గృహ పొదుపులో క్షీణత  మరింత ముప్పును మారవొచ్చని మెర్సి డస్ నివేదికలు చెబుతున్నాయి.