Indias Forex Reserves:8వారాల తర్వాత.. పెరిగిన భారత విదేశీ మారకం నిల్వలు

భారత విదేశీ మారక నిల్వలు పెరిగాయి. నవంబర్ 29తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 658.1 బిలియన్ డాలర్లకు చేరాయి. శుక్రవారం( డిసెంబర్ 6) విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిల్వలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.  గత ఎనిమిది వారాలుగా తగ్గుతూ వస్తున్న విదేశీ నిల్వలు అనూహ్యంగా పెరిగాయి.

గత వారంతో పోలిస్తే దేశ ఫారెక్స్ కిటీ 12,483.73 లక్షల కోట్లకు (1.5 బిలియన్ డాలర్లకు) పెరిగింది. గతవారం నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 656.58 బిలియన్ డాలర్లకు చేరాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశ డెట్ ,ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్లు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

ALSO READ : రైతులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఈజీగా వ్యవసాయ రుణాలు

నవంబర్ నెలలో బాండ్లు ,ఈక్విటీల నుంచి రూ. 32వేల210  కోట్లు వచ్చాయి. అయితే అక్టోబర్‌లో FPIలు ఇండియన్ మార్కెట్ల నుంచి రూ.96వేల 358 కోట్లను వెనక్కి తీసుకున్నాయి.అదే సమయంలో బలమైన డాలర్ ,ఎడతెగని విదేశీ ప్రవాహాల మధ్య భారత రూపాయి ఒత్తిడికి లోనయింది.