హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ ట్రస్టులు (ఇన్విట్స్) గురించి పెట్టుబడిదారుల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ), భారత్ ఇన్విట్స్ అసోసియేషన్ (బీఐఏ) సంయుక్తంగా దీనిని నిర్వహించాయి.
రిటైల్ పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడంతోపాటు రీట్స్, ఇన్విట్స్ స్వీకరణను ప్రోత్సహించడం, ఆపరేటింగ్, రెగ్యులేటరీ వాతావరణాన్ని బలోపేతం చేయడం, క్యాపిటల్ మార్కెట్లను బలోపేతం చేయడం, మొత్తం ఇన్వెస్టర్ల అవగాహనను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. రీట్స్, ఇన్విట్స్‌ను అర్థం చేసుకోవటం, పన్ను ఆదా చేసే విధానాలు, పోర్ట్‌ఫోలియో స్కేల్ వంటి అంశాల గురించి ఈ సందర్భంగా వివరించారు.