భారత్కు ట్రంప్ హెచ్చరిక.. బేరిష్ సెంటిమెంట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ఇండియన్ స్టాక్ మార్కెట్లో బేరిష్ సెంటిమెట్ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు మార్కెట్ల పతనం అయ్యాయి. ఫెడ్ రిజర్వ్ నిర్ణయంపై కొనసాగుతున్న సందిగ్ధత, అదే విధంగా ఎఫ్ఐఐ లసెల్లింగ్.. వెరసి  మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ ఒకానొక దశలో 634.38 (0.78%) పాయింట్స్ డౌన్ అయ్యి ఇంట్రాడే లో 80,050.07 పాయింట్ల వరకు చేరుకుని చివరికి 80,182.20 వద్ద స్థిరపడింది.  అదేవిధంగా నిఫ్టీ ఇంట్రాడేలో 186.15  పాయింట్లు డౌన్ అయ్యి 24149.85 కు చేరుకుంది. చివరికి కొంత బయ్యింగ్ రావడంతో 24,198.5 పాయింట్ల వద్ద స్థిరపడింది. 

మార్కెట్ పతనానికి ముఖ్య కారణాలు:
బుదవారం ఫెడ్ రిజర్వ్ ఔట్ కమ్ ఉన్న నేపథ్యంలో మార్కెట్లు సోమవారం నుండి వరుసగా పడుతూనే ఉన్నాయి. బుధవారం నిఫ్టీ 24,200 సపోర్ట్ ను బ్రేక్ చేసింది. అయితే బుధవారం మార్కెట్ల పతనానికి ఫెడ్ ఔట్ కమ్ పై ఉన్న సందిగ్ధతతో పాటు మరికొన్ని కారణాలు ఉన్నాయి.

 ట్రేడర్లను ఆందోళనకు గురిచేసిన ట్రంప్ హెచ్చరికలు
త్వరలో యూఎస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక బుధవారం మార్కెట్ పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. భారత్ తమ వస్తువులపై అత్యధికంగా పన్ను వసూలు చేస్తోందని, ప్రతిచర్యగా తాము కూడా త్వరలో భారీ ఎత్తున భారత్ వస్తువులపై పన్నులు విధిస్తామని హెచ్చరించారు. భారత్, బ్రెజిల్ తమ వస్తువులపై అధికంగా పన్నులు వేస్తున్నాయని, త్వరలోనే ఆ దేశాలపై పన్ను పోటు తప్పదని హెచ్చరించడంతో ట్రేడర్లలో ఆందోళన మొదలైంది. దీంతో ఇండియన్ మార్కెట్లు సెల్లింగ్ ప్రెజర్ కు గురయ్యాయి.

ఎఫ్ఐఐల  అమ్మకాల జోరు
 డాలర్ బలపడటం, రూపీ క్షీణించడంతో మార్కెట్ గత కొన్ని రోజులుగా సెల్లాఫ్ కు గురవుతున్నాయి. బుధవారం ఏకంగా రూ.6409.86 కోట్ల అమ్మకం బేరిష్ సెంటిమెంట్ కు బలాన్ని చేకూర్చింది. 
మార్కెట్లో ర్యాలీ వచ్చిన ప్రతీసారి ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాల జోరు పెంచుతున్నారు. మంగళవారం క్యాష్ మార్కెట్ లో 6410 కోట్ల అమ్మకా జరిపిన ఎఫ్ఐఐ ల సెంటిమెంట్ చూస్తుంటో ర్యాలీలో మరింత అమ్మకానికి సూచనగా కనిపిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.వినయ్ కుమార్ తెలిపారు. 

యూఎస్ ఫెడ్ ఔట్ కమ్స్ దృష్టిలో ఉంచుకొని
గ్లోబల్ మార్కెట్ ఫోకస్ అంతా ఫెడ్ రిజర్వ్ మానిటరీ పాలసీ  నిర్ణయం అయిన  రేట్ కట్ పై నే ఉందని చెప్పాలి. 25 పాయింట్ల రేట్ కట్ ముందే ఊహించిన మార్కెట్ అందుకు తగినట్లుగా ఫ్యాక్టర్ అయ్యింది. ఫ్యూచర్ పాలసీ ఫెడ్ కామెంటరీపైనే సంశయం నెలకొందని, రేట్ కట్స్ ఇంకొన్నాళ్లు ఆపుతారా లేదా  స్లో డౌన్ ఉంటుందా అనే దానిపైనే గ్లోబల్ మార్కెట్స్ ఆందోళన అని హెచ్ డి ఎఫ్ సి సెక్యూరిటీస్ అనలిస్ట దేవర్ష్ వకీల్ తెలిపారు. 

ALSO READ | డిసెంబర్ 18న నుంచి రియల్‌‌మీ 14ఎక్స్‌‌ 5జీ సేల్​