10 నెలల్లోనే 77 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ

న్యూఢిల్లీ: వివిధ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు భారీగా గోల్డ్‌‌ కొంటున్నాయి. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌బీఐ) ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో ఏకంగా 27 టన్నులు బంగారాన్ని కొనుగోలు చేసింది.  వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) రిపోర్ట్ ప్రకారం, సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం కిందటేడాది అక్టోబర్‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో 60 శాతం పెరిగింది. 

ఆర్‌‌‌‌బీఐ  ఈ ఏడాది జనవరి– అక్టోబర్‌‌‌‌ మధ్య 77 టన్నులు కొనుగోలు చేసింది. కిందటేడాది ఇదే టైమ్‌‌తో పోలిస్తే  ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది.  ప్రస్తుతం ఇండియాలో గోల్డ్ నిల్వలు 882 టన్నులకు చేరుకున్నాయి. ఇందులో  510 టన్నులు ఇండియాలో ఉన్నాయి. మిగిలినవి విదేశాల్లో   ఉన్నాయి. ఇండియా తర్వాత టర్కీ, పోలాండ్‌‌  పెద్ద మొత్తంలో గోల్డ్ కొనుగోలు చేశాయి.