క్యూ2లో జీడీపీ వృద్ధి 5.4 శాతం .. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన గ్రోత్ రేట్‌

  • తయారీ, మైనింగ్ సెక్టార్లలో తగ్గిన ప్రొడక్షన్‌
  • అయినా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా

న్యూఢిల్లీ:  తయారీ,  మైనింగ్ సెక్టార్లలో ప్రొడక్షన్ తగ్గడంతో  ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ2) ‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఆర్థిక వ్యవస్థ కేవలం 5.4 శాతమే వృద్ధి చెందింది. గత రెండేళ్లలో  ఇదే తక్కువ జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్ ప్రొడక్ట్‌) వృద్ధి రేటు.  అయినప్పటికీ  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందిన అతిపెద్ద ఎకానమీగా నిలిచామని ప్రభుత్వం చెబుతోంది. చైనా ఎకానమీ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.3 శాతం వృద్ధి చెందింది.   

కిందటేడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌ రేట్ 8.1 శాతంగా రికార్డయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ( 4.3 శాతం) తర్వాత తాజాగా సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్ట్ అయిన జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌ రేటే తక్కువ.  నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఓ) డేటా ప్రకారం, గతేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యవసాయం రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌ (జీవీఏ– పెరిగిన గూడ్స్, సర్వీస్‌‌‌‌‌‌‌‌ల విలువ) 1.7 శాతం పెరగగా, ఈసారి  3.5 శాతం వృద్ధి చెందింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ జీవీఏ మాత్రం 14.3 శాతం గ్రోత్ రేట్‌‌‌‌‌‌‌‌ నుంచి 2.2 శాతానికి తగ్గింది. 

ALSO READ | ఈఎల్‌‌ఐ కోసం యూఏఎన్ యాక్టివేషన్‌‌ తప్పనిసరి

మైనింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్పాదకత కూడా కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11.1 శాతం పెరిగితే, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 0.01 శాతం మాత్రమే వృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌, ప్రొఫెషనల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీవీఏ 6.2 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ నుంచి  6.7 శాతం గ్రోత్ రేట్‌‌‌‌‌‌‌‌కు పెరిగింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లయ్‌‌‌‌‌‌‌‌, ఇతర యుటిలిటీ సర్వీస్‌‌‌‌‌‌‌‌ల సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో జీవీఏ 3.3 శాతం పెరగగా, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన 10.5 శాతం గ్రోత్ రేట్ నుంచి తగ్గింది. నిర్మాణ రంగం గ్రోత్ రేట్ 13.6 శాతం నుంచి  7.7 శాతానికి దిగొచ్చింది. 

కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా జీడీపీ 6.7 శాతం పెరిగిన విషయం తెలిసిందే. ‘రియల్ జీడీపీ లేదా నిలకడైన కరెన్సీ దగ్గర ఇండియా జీడీపీ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రూ. 44.10 లక్షల కోట్లుగా రికార్డయ్యింది.  కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది  రూ.41.86 లక్షల కోట్లుగా ఉంది.  5.4 శాతం గ్రోత్ రేట్ నమోదైంది’ అని ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఓ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. నామినల్ జీడీపీ లేదా ప్రస్తుత కరెన్సీ రేట్ల వద్ద జీడీపీ  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.76.60 లక్షల కోట్లుగా ఉందని, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డయిన రూ. 70.90 లక్షల కోట్ల నుంచి 8 శాతం  వృద్ధి చెందిందని వివరించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–సెప్టెంబర్ మధ్య  రియల్ జీడీపీ రూ.87.74 లక్షల కోట్లకు చేరుకోగా, కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–సెప్టెంబర్ మధ్య రూ.82.77 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో 6 శాతం గ్రోత్ రేట్ నమోదైంది. నామినల్ జీడీపీ రూ.141.40 లక్షల కోట్ల నుంచి రూ.153.91 లక్షల కోట్లకు పెరిగింది. 8.9 శాతం గ్రోత్ రేట్ నమోదయింది.

పెరిగిన ఫిస్కల్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌ 

ప్రభుత్వ ఫిస్కల్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌ (ఖర్చులు మైనస్ ఆదాయం)  బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో వేసుకున్న అంచనాల్లో 46.5 శాతానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– అక్టోబర్ మధ్య రూ.7,50,824 కోట్లకు పెరిగింది. కిందటేడాది ఏప్రిల్‌–అక్టోబర్‌‌లో ఫిస్కల్ డెఫిసిట్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ అంచనాల్లో  45 శాతంగా ఉంది. 2024–25 లో ఫిస్కల్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌ జీడీపీలో 4.9 శాతానికి కంట్రోల్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అంటే రూ. 16,13,312 కోట్లలోపు ఉంచాలి. 

తగ్గిన కీలక సెక్టార్ల పనితీరు..

కీలకమైన ఎనిమిది సెక్టార్ల పనితీరు ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నెమ్మదించింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సెక్టార్ల ఉత్పాదకత 12.7 శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 3.1 శాతమే పెరిగింది. అదే ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన 2.4 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే పెరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ పడిపోయింది.