ఇంకో ఐదేళ్లలో 3 కోట్ల 12 లక్షలు ఇండ్లు కావాలి : సీఐఐ–నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • 1.9 లక్షల ఎకరాల భూమి అవసరం
  • రియల్ ఎస్టేట్ సెక్టార్ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.67 లక్షల కోట్లకు పెరిగే ఛాన్స్
  • అఫోర్డబుల్ హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫైనాన్షియల్ సంస్థలకూ మేలు 

న్యూఢిల్లీ:  రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ మార్కెట్ ఇంకో ఐదేళ్లలో మరింతగా విస్తరించనుంది. ఇండియాలో 2030 నాటికి 3.12 కోట్ల అఫోర్డబుల్ ఇండ్లు (అందుబాటు ధరల్లో దొరికే ఇండ్లు) అవసరమని అంచనా.  దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.67 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఐఐ, నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్ జాయింట్ రిపోర్ట్ పేర్కొంది. సాధారణంగా ఢిల్లీ, ముంబైలో రూ.2 కోట్ల కంటే తక్కువ విలువుండే ఇండ్లు, ఇతర సిటీలలో రూ.కోటి కంటే తక్కువ ఉండే ఇండ్లు అఫోర్డబుల్ హౌసింగ్ కేటగిరీలోకి  వస్తున్నాయి. ఇప్పటికే 1.01 కోట్ల అఫోర్డబుల్ ఇండ్ల అవసరం ఉందని అంచనా. 

డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గ సప్లయ్ లేదని,  రియల్ ఎస్టేట్ డెవలపర్లకు బోలెడు వ్యాపార అవకాశాలు ఉన్నాయని  న్యూఢిల్లీలో జరిగిన ‘అఫోర్డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌసింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా’ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గులామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియా అన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ సెక్టార్ మాత్రమే కాదని, ఫైనాన్షియల్ సంస్థలకు  బోలెడు వ్యాపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

ఇండ్లు కొనడంలో 77 శాతం మంది లోన్లపై ఆధారపడుతున్నారని అనుకుంటే, అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు రూ.45 లక్షల కోట్ల విలువైన బిజినెస్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి’ అని సీఐఐ–నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ పేర్కొంది.  ప్రస్తుతం ఉన్న హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్ సైజుతో పోలిస్తే ఇది  మూడు రెట్లు ఎక్కువని తెలిపింది. 

 మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌసింగ్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తరించాలంటే సరియైన మార్కెటింగ్ స్ట్రాటజీ అవసరం. కార్యకలాపాలను పెంచాల్సిన అవసరం ఉందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ క్యాపిటల్ ఎండీ విపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంగ్తా అన్నారు. మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీ ఇండ్లకు లోన్లు ఇవ్వడంపై ఫోకస్ పెట్టామని ఆయన తెలిపారు.   హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ క్యాపిటల్ 3 లక్షల ఇండ్లకు లోన్లు ఇచ్చిందని విపుల్ వివరించారు.

రూ.9 లక్షల లోపు ఆదాయం ఉన్నవారే..

అఫోర్డబుల్ హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డిమాండ్ చేరుకోవడానికి  పెద్ద మొత్తంలో ల్యాండ్ అవసరం ఉంటుందని  సీఐఐ–నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్ రిపోర్ట్ పేర్కొంది.  2030 నాటికి  3.12 కోట్ల ఇండ్ల డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి సుమారు 1.9 లక్షల ఎకరాలు అవసరమని తెలిపింది. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ విధానంలో ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న భూమిలో అఫోర్డబుల్ ఇండ్లు కట్టాలని సలహా ఇచ్చింది.  

డెవలపర్లకు ట్యాక్స్ రాయితీలు ఇవ్వాలని, అదనంగా ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) ను  హౌసింగ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కేటాయించాలని  సిఫార్సు చేసింది.  ‘అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడాదికి రూ.9 లక్షల లోపు ఆదాయం పొందుతున్నవారే  టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  ఆదాయాల పరంగా ప్రజలను ఈడబ్ల్యూఎస్ (ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందుతున్నవారు), ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐజీ (రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు),ఎంఐజీ (రూ.6–9 లక్షలు) గ్రూప్‌‌లుగా విభజించొచ్చు’ అని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.