మల్లన్న ఆలయ ఆదాయం రూ.18.74 కోట్లు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ 2023,-24 నికర ఆదాయం రూ.18,74,65,477 వచ్చిందని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది టికెట్లు, సేవల ఆదాయం రూ.8,77,35,445, ప్రసాదం రూ.5, 61,00,690, హుండీల ఆదాయం రూ.7,53,57,522, క్యాపిటల్స్ డిపాజిట్లు రూ.13,15,59,896, డిపాజిట్ల ఇంట్రెస్టులు రూ.1,31,79,329, టెండర్స్ లీజులు, లైసెన్సుల ద్వారా రూ.2,63,86,640, అన్నదానం విరాళాలు రూ.25,46,514, ఇతర ఆదాయాలు రూ.88,61,455 తో పాటు అడ్జస్ట్మెంట్  రూ.74,41,922  ఆదాయాలు కలిసి మొత్తం ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.41,18,30,656 ఉన్నాయన్నారు. వీటితో పాటు నగదు రూ.1,23,040, బ్యాంకు బ్యాలెన్స్ రూ.5,14,79,509 కలుపుకొని మొత్తం గ్రాండ్ ఇన్​కమ్​రూ.46, 34,33,206 వచ్చిందని తెలిపారు. 

2023,-24 ఖర్చుల వివరాలు..

వీటిలో ఫెస్టివల్ ఖర్చులు రూ.73,51,799, ప్రసాదంరూ.4, 13, 81, 651,  ఎస్టాబ్లిష్మెంట్ చార్జీలు రూ. 5, 61, 08, 375, స్టేషనరీ పేమెంట్స్  2,58,09,303, అడ్జస్ట్మెంట్ రూ.13,86,35,328, ఇతర ఖర్చులు రూ.72,69,914, క్యాపిటల్స్ రూ.51,48,428,  అన్నదానం రూ.36,39,676, జాతర ఎక్స్పెండిచర్ రూ.74,46,711, కన్స్ట్రక్షన్స్ ఖర్చులు రూ.6,84,20,391, రెమ్యునరేషన్స్ రూ.3,80,00,200, సానిటేషన్ ఖర్చులు రూ.83,45,754 కలిసి మొత్తం క్లోజింగ్ బ్యాలెన్స్ రూ.40, 75,57,531 నగదు రూ.55,60,488, బ్యాంకు రూ.5,03,15,187 కలిసి మొత్తం గ్రాండ్ ఎక్స్పెండిచర్ రూ.46,34,33,206 వచ్చిందని పేర్కొన్నారు.  

ఇందులో నుంచి డిడక్షన్ ఆస్ఫర్ స్టేట్​మెంట్​ఇన్ ఫాం 3 ప్రకారం రూ.18,01,76,435 ఎనీ ఆధర్ డిడక్షన్ రూ.9,57,91,292 కలిపి టోటల్ డిడక్షన్ రూ.27,59,67,728 రావడంతో క్లోజింగ్ మొత్తం  రూ.46, 34,33,206  నుంచి టోటల్ డిడక్షన్ మొత్తం రూ.27,59,67,728 తీసివేయగా ఈ ఏడాది రూ.18,74,65,477 వచ్చిందని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు 60 లక్షల పైన ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు చెప్పారు.