- సింగరేణి డిస్పెన్సరీలో ఆక్యుపేషనల్హెల్త్ సర్వీస్ సెంటర్ ప్రారంభం
నస్పూర్, వెలుగు : శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్సింగరేణి డిస్పెన్సరీలో రూ.15 లక్షలతో ఆధునీకరించిన ఆక్యుపేషనల్ హెల్త్సర్వీస్ సెంటర్‌ను సింగరేణి కార్పొరేట్ జీఎం గురువయ్య, శ్రీరాంపూర్ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సింగరేణి చీఫ్ మెడికల్ఆఫీసర్ డాక్టర్సుజాత, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ బాజీసైదా, సింగరేణి అధికారుల సంఘం ప్రెసిడెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీజీఎం పర్సనల్పి.అరవిందరావు, డీజీఎం ఆనంద్‌కుమార్, డాక్టర్లు పాల్గొన్నారు.
సెక్యూరిటీ గార్డులకు జీరో శాలరీ అకౌంట్ల అందజేత
శ్రీరాంపూర్ఏరియా సింగరేణి ఎస్ఆండ్పీసీ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు శుక్రవారం ఏరియా జీఎం సంజీవరెడ్డి హెచ్ డీఎఫ్బ్యాంకు కార్పొరేట్ జీవో శాలరీ అకౌంట్లు అందజేశారు. ఇన్చార్జి ఏస్వోటు జీఎం గోపాల్‌సింగ్, సెక్యురిటీ ఆఫీసర్ మురళీమోహన్ పాల్గొన్నారు.