ఎంపీ వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ నేతల కంప్లైంట్

గోదావరిఖని, వెలుగు: సోషల్ మీడియాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంచిర్యాలకు చెందిన టీబీజీకేఎస్ లీడర్​గోగుల రవీందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక  కాంగ్రెస్​ లీడర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖని వన్​టౌన్​పోలీస్​స్టేషన్​లో ఎస్ఐ భూమేశ్​కంప్లయింట్ చేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమైన దివంగత దళిత నేత కాకా వెంకటస్వామి మనవడైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా అకారణంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎంపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టరీత్యా తగు చర్య తీసుకోవాలని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసినవారిలో కాంగ్రెస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల గోవర్ధన్​ రెడ్డి, సీనియర్​ లీడర్లు పి.మల్లికార్జున్, బోయిని మల్లేశ్ యాదవ్​, నర్సింగ్ దొర, కామ విజయ్, తిప్పారపు మధు, రఫీక్, హాకీం ఉన్నారు.