మంచిర్యాల జిల్లా: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిర్వహించే క్యాంటీన్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగారు ఉద్యోగులు. జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ బేస్ పని చేసే కార్మికుల కోసం క్యాంటీన్ నడుపుతున్నారు. శనివారం ఉదయం టిఫిన్స్, ఇడ్లీ చట్నీలో పురుగులు, ఈగలు వస్తున్నాయని కార్మికులు ఆందోళన చేశారు.
Also Read :- తిరుపతి లడ్డు కాంట్రవర్సీలో.. అమూల్ డైరీ రియాక్ట్
టిఫిన్స్ తయారీలో నాణ్యతలేని వస్తువులను, కుళ్లిన ఆలు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వాహకులపై యాజమాన్యానికి అనేక సార్లు కంప్లెయింట్ చేసిన పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా క్యాంటీన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు తేల్చి చెప్పారు.