రాబోయే  రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా  రైతు రుణమాఫీ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో  రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ అశోక్ సంగవాన్, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ పాల్గొన్నారు.  క్యాసం పల్లి రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నేతలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  షబ్బీర్ అలీ మాట్లాడుతూ  రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు.  ఎన్నికల సమయంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ  ..,.   రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని  కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్నా.. అంతకంటే ముందుగానే ఈ రోజే ( జులై18) సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారన్నారు. 

ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పినా.. ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా . . రైతు రుణ మాఫికి కట్టుబడి ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదని మరోసారి రుజువైందన్నారు.  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని షబ్బీర్ అలీ అన్నారు.  పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. గాంధీ కుటుంబం మాట  అది శిలాశాసనం  అన్నారు.