సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు : లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ సోమవారం సీపీ అనురాధ ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని, ముందస్తు పర్మిషన్ లేకుండా టెంట్లు వేయొద్దని, డీజే  పాటలు పెట్టొద్దని, సభలు,  సమావేశాలు నిర్వహించొద్దన్నారు. విజయోత్సవ ర్యాలీలు జరపకూడదని, పటాకులు కాల్చకూడదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసుల సూచనలు సలహాలు పాటించి సహకరించాలని సూచించారు.