హైదరాబాద్, వెలుగు: ట్రావెల్, టూరిజం హాస్పిటాలిటీ రంగాల కోసం నిర్వహిస్తున్న 'ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్' (ఐఐటీయం) ఎగ్జిబిషన్ హైదరాబాద్లో శుక్రవారం మొదలయింది. ఇది ఈ నెల ఎనిమిదో తేదీన ముగుస్తుంది. ఈ ప్రీమియర్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాల వివరాలను ప్రదర్శిస్తోంది.
టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, స్టేట్ టూరిజం బోర్డులు, అంతర్జాతీయ డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీల భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, పరిశ్రమలో కొత్త అవకాశాలను సృష్టించడానికి ఇది ఐఐటీఎం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మధ్యతరగతి వర్గాల ప్రయాణాలు బాగా పెరిగాయని చెప్పారు.