నారాయణ్ ఖేడ్, వెలుగు: మండలంలోని హనుమంతరావు పేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా బంజే సరోజ పొలంలో ఆదివారం మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది.
జేసీబీతో చేను లెవల్ చేస్తుండగాఈ ఘటన జరిగింది. పురాతనమైన ఈ విగ్రహాన్ని చూడడానికి జనాలు తరలి వచ్చారు. విగ్రహం సుమారు రెండున్నర నుండి మూడు కిలోల వరకు బరువు ఉంటుంది. ఆ విగ్రహాన్ని పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ పురోహితులు భక్తుల సందర్శనార్థం ఉంచారు.