భారీగా క్లెయిమ్స్​ను పరిష్కరించిన ఐసీఐసీఐ ప్రూ లైఫ్

హైదరాబాద్​, వెలుగు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ జులై 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు   ఏకంగా 99.04శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని సాధించినట్టు ప్రకటించింది. ముఖ్యంగా, డెత్ క్లెయిమ్‌‌ను సెటిల్ చేయడానికి సగటున  1.2 రోజులు మాత్రమే పట్టిందని తెలిపింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అమిష్  మాట్లాడుతూ రెండో క్వార్టర్​లో తమకు రికార్డుస్థాయి క్లెయిమ్ సెటిల్‌‌మెంట్ రేషియో ఉందని చెప్పారు. 

 ఈకాలంలో మొత్తం రూ. 451 కోట్ల విలువైన డెత్ క్లెయిమ్‌‌లను సెటిల్ చేశామని అన్నారు.  “క్లెయిమ్ ఫర్ ష్యూర్” కార్యక్రమం కింద, అన్ని డాక్యుమెంట్‌‌లు సమర్పించిన తర్వాత ఒక రోజులో అర్హత ఉన్న క్లెయిమ్‌‌లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కింద రెండో క్వార్టర్​లో రూ. 71.24 కోట్ల విలువైన క్లెయిమ్స్​ను సెటిల్​చేశామని అమిష్​ వివరించారు.