ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లాభం రూ.4.89 కోట్లు

హైదరాబాద్, వెలుగు: రిఫ్రిజిరేషన్​ సొల్యూషన్స్‌‌‌‌లో అందించే హైదరాబాద్​ కంపెనీ ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ రెండో క్వార్టర్లో రూ.4.89 కోట్ల లాభం సాధించింది.  గత సెప్టెంబరు క్వార్టర్​తో పోలిస్తే ఇది 6.53శాతం పెరిగింది. నికర లాభం మార్జిన్ మునుపటి క్వార్టర్​లో 4.62శాతం నుంచి 4.81శాతంకి మెరుగుపడింది.

 కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.101.38 కోట్లకు పెరిగింది. మొదటి క్వార్టర్ ఆదాయం రూ.83.17 కోట్లతో పోలిస్తే 21.88శాతం ఎగిసింది. 2024 రెండో క్వార్టర్​ఆదాయం రూ.75.72 కోట్లతో పోలిస్తే 34శాతం పెరిగింది.