ఆదిలాబాద్​లో హ్యుందాయ్ షోరూం ప్రారంభం

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ పట్టణం లోని నలంద డిగ్రీ కాలేజీ ఎదురుగా గురువారం ప్రకాశ్ హ్యుందాయ్ కార్ల షోరూం ప్రారంభమైంది. షోరూంను అత్యాధునిక సదుపాయాలు, సరికొత్త హంగులుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా రీజినల్ మేనేజర్ (ఏపీ, తెలంగాణ) జి. రాంకుమార్ తెలిపారు. 

ఆదిలాబాద్ ప్రాంత ప్రజలకు సేల్స్, సర్వీస్, స్పేర్స్ లో అందించేందుకు అన్ని సదుపాయాలతో షోరూంను అందుబాటులోకి తీసుకువచ్చి నట్లు చెప్పారు. కార్యక్రమంలో షోరూం ఎండీ నల్ల దినేశ్ రెడ్డి, సీఈవో నల్ల ప్రతిహాస్ రెడ్డి, ఆర్ఎస్వో మేనేజర్ రోహిత్ కుమార్, టీఎస్ఎం స్నేహ మయి, ప్రకాశ్, షోరూం మేనేజర్ ఉమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.