మంచిర్యాలలో హైడ్రా తరహా కూల్చివేతలు..ఐదు అంతస్తుల భవనం స్మాష్

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.  మంచిర్యాల నస్ఫూర్​ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనంబర్​ 42 లో ఆక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల బిల్డింగ్​ను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. 

సర్వే నంబర్​ 40 డాక్సుమెంట్​లతో మున్సిపల్​ పర్మిషన్​ తీసుకొని సర్వే నంబర్​ 42లో ఐదు అంతస్తుల మేర నిర్మాణం చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.  బిల్డింగ్​ఓనర్​కు మున్సిపల్​ అధికారులు  2022 నుంచి ఇప్పటివరకు నోటీసులు జారీ చేశారు.  

తాజాగా మరోసారి ముందస్తు నోటీసులు అందించారు.  స్పందించకపోవడంతో రెవెన్యూ, పోలీసుల సమక్షంతో కూల్చివేతలను కొనసాగిస్తున్నారు.  సామాన్లను సిబ్బందితో ఖాళీ చేయించి జేసీబీలతో కూల్చివేశారు.  బీఆర్ఎస్​ హయంలో రాజకీయ పలుకుబడితో ఓనర్​ అక్రమ బిల్డింగ్​నిర్మాణాన్ని కాపాడుకున్నారు.