మంచిర్యాల, వెలుగు : మొన్నటివరకు వెలవెలపోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు వర్షాలతో నాలుగు రోజుల్లోనే జలకళను సంతరించుకుంది. కడెం గేట్లు ఎత్తడంతో పాటు గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రాజెక్టులోకి చేరుతోంది. 20.175 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు జూన్‌లో 4 టీఎంసీల డెడ్‌స్టోరేజీకి చేరింది.
ఈనెల 18న 5.222 టీఎంసీల నుంచి సోమవారం సాయంత్రానికి 10.557 టీఎంసీలకు చేరింది. 20,655 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్‌కు 331 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు.