బాసర ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వేదవ్యాస మహర్షి స్వామికి దర్శనానికి భక్తులు బారులు తీరారు.  శ్రీ వ్యాసమహర్షి  స్వామి వారికి విశేష ద్రవ్యాలతో ఆలయ పూజారులు మహా అభిషేకం చేశారు. అనంతరం రుద్ర స్వీయ కారం రూపంలో అలంకరించారు. 

ప్రత్యేక దినం కావడంతో  ఆలయంలో  తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి కుంకుమార్చన  పూజలు చేస్తున్నారు.