మోడీ 3.0 బడ్జెట్ పై భారీ అంచనాలు.. అందులో ముఖ్యంగా ఇవే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024- 25 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ బడ్జెట్‌పై వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, వేతన జీవులకు భారీ అంచనాలున్నాయి. కాగా ఈ ఏడాది బడ్జెట్ లో ముఖ్యంగా.. పన్ను విధానంలో మార్పులు ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పొదుపు కోసం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేటాయింపులు పెంచి.. ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచే ఛాన్సుంది. మరోవైపు కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపుపై, రైతులకుఇచ్చే లోన్లు, సబ్సీడీలపై, వృద్ధులకు ఇచ్చే రాయితీలపై, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కొత్త పన్నుల విధానంపై గతంతో పోలిస్తే ఈ బడ్జెట్ లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. 

మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సులభంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.