15 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇటీవల ప్రాణహిత ఉప్పొంగింది. ఫలితంగా ప్రాణహిత బ్యాక్ వాటర్ కింద ఉన్న దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్, దిగిడ, లోహ, శంకరపురం, రావులపల్లి, టేపర్గ్రామాల్లోని వేల ఎకరాల పంట నీటి మునిగింది.
నీటిలోనే దాదాపు 10 రోజులుగా మునిగి ఉండడంతో పంట మొత్తం మాడిపోయింది. గంపెడాశలతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతన్నలకు కన్నీళ్లే మిగిలాయి. గవర్నమెంట్ తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.