2025లో కోటీశ్వరులు కావటం ఎలా: ఈ 15 మ్యూచువల్ ఫండ్స్ లో ట్రై చేయండి..!

కోటీశ్వరుడు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఆ స్థాయికి చేరేవాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. కోట్లు సంపాదించడం చాలా కష్టం.. దానికి అదృష్టం ఉండాలి అని ఎంతో మంది భావిస్తారు. అయితే సరైన ప్లానింగ్ ఉంటే కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

సంపద కూడబెట్టడం అనేది ఓ మారాథాన్ పరుగులాంటింది..త్వరగా డబ్బును సంపాదించేందుకు ఎలాంటి మ్యాజిక్ లేదు.. ఓ క్రమబద్దమైన, నమ్మకమైన విధానాలను అనుసరించడం ద్వారా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  టిలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. 

పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టేందుకు  మ్యూచువల్ ఫండ్స్ (MF)  ఓ మంచి మార్గం..రిటర్స్న్ కూడా బాగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణకు ఫండ్ మేనేజర్లు ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్లు.. ఇన్వెస్టర్ల నుంచి డబ్బును సేకరించి స్టాక్ మార్కెట్లో పెడతారు. 

ALSO READ | ఈ బ్యాంకు ఖాతాలు మూసేస్తున్నారు.. మీ ఖాతాల్లో డబ్బులు ఉంటే వెంటనే డ్రా చేసుకోండి

ఈక్విటీలు (షేర్లు), బాండ్లు, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో పెట్టుబడిగా పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ లో మంచి రిటర్న్స్ తోపాటు పెట్టుబడికి భద్రత ఉంటుంది. ఫండ్ మేనేజర్లు సంపాదించిన లాభాలను ఇన్వెస్టర్లకు పంపిణీ చేస్తాయి. 

మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ కాలం పెట్టుబడి ఉంచితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్‌లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

స్టాక్స్ విలువ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విలువ కూడా పెరుగుతుంది. బాండ్లలో పెట్టుబడి పెడితే.. ఆ బాండ్స్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయాన్ని పెంచుతుంది. ఒకే మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్, బాండ్లలో పెట్టుబడి పెడితే నష్టపోయే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. 

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి కొద్దిగా రిస్క్ అయినప్పటికీ.. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా హై రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. మంచి మ్యూచువల్ ఫండ్ ఎంపిక చాలా ముఖ్యం. 

బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

  • ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్
  • నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్
  • HDFC టాప్ 100 ఫండ్
  • మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్
  • బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ ఫండ్

బెస్ట్ మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

  • మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్
  • HDFC మిడ్‌క్యాప్ అవకాశాల ఫండ్
  • WhitOak మిడ్‌క్యాప్ ఫండ్
  • HSBC మిడ్‌క్యాప్ ఫండ్
  • ఎడెల్వీస్ మిడ్‌క్యాప్ ఫండ్

బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్

  • మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్
  • బంధన్ స్మాల్ క్యాప్
  • టాటా స్మాల్ క్యాప్
  • HSBC స్మాల్ క్యాప్
  • మహీంద్రా మ్యానులైఫ్ స్మాల్ క్యాప్

దీర్ఘకాలిక పెట్టుబడులకు SIP లు మంచి మార్గం.. SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్.. మీ డబ్బును  చిన్నమొత్తాలలో పెట్టుబడి పెట్టే విధానం.. ముఖ్యంగా నెలసరి జీతం ఉన్న ఉద్యోగులకు బాగా సరిపోతుంది. SIP స్టాక్ మార్కెట్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తారు. SIP లతో రిస్క్ తక్కువ.  దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మంచి రిటర్స్న్ పొందవచ్చు.