కార్ల తయారీ కంపెనీ హోండా అమేజ్ సిరీస్లో మూడో జనరేషన్ కారును లాంచ్ చేసింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, 8 ఇంచుల ఫ్లోటింగ్ టచ్స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫయర్, సిక్స్ స్పీకర్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.
ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90 పీఎస్ శక్తిని, 110 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఇస్తుంది. ధరలు రూ.ఎనిమిది లక్షల నుంచి రూ.10.90 లక్షల వరకు ఉంటాయి.