ఆఫీసర్ల నిర్లక్ష్యంతో కార్మికుల్లో గందరగోళం

నస్పూర్, వెలుగు :  సింగరేణి ఆఫీసర్ల నిర్లక్ష్యంతో కార్మికులు గందరగోళంలో పడ్డారని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ ఆహ్మద్ అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే7 గనిని 1972లో ప్రారంభించారని, అటువంటి గనికి ఫారెస్ట్ అనుమతులు లేవని ఆఫీసర్లు అనడం ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ల అలసత్వం కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తాయని, యాజమాన్యం వెంటనే స్పందించి సంబంధిత ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్య గుర్తింపు సంఘం ఆఫీసర్లకు దందాగా మారుతుందని, కార్మికుల నుంచి దోచుకోవడానికి తెరలేపినట్టేనని ఆరోపించారు. సమస్య ఏమైనా ఉంటే కార్మిక సంఘాలతో మాట్లాడి పరిష్కార దిశగా ముందుకుసాగలన్నారు. హెచ్ఎంఎస్ లీడర్లు అనిల్ రెడ్డి, సారయ్య, జీవన్ జోయల్, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్, అశోక్, సందీప్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాలగొన్నారు.

దీనికి బాధ్యులు ఎవరు? : టీబీజీకేఎస్

ఆర్కే7గని గందరగోళానికి బాధ్యులు ఎవరు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెంటనే చెప్పాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. నస్పూర్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలపాలన్నారు. చిన్న తప్పిదాలకే ఎల్లో, రెడ్ కార్డులంటూ కార్మికులను ఇబ్బందులు పెడుతున్న ఆఫీసర్లు..

వారి తప్పిదాలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. కార్మికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని, లేదంటే వారి పక్షాన టీబీజీకేఎస్ పోరాడుతుందన్నారు. లీడర్లు సురేందర్ రెడ్డి, లక్ష్మణ్, రామ్మూర్తి, సమ్మయ్య, రాజునాయక్, మహిపాల్ రెడ్డి తదితరులు పాలగొన్నారు