కోరిన కోర్కెలు తీర్చే మారుతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..

కోతులు కనిపించగానే దూరంగా తరిమేస్తుంటాం. కానీ, వీళ్లు కోతులకి ఇసుమంత కూడా హాని చేయరు. వాటిని దైవంలా కొలుస్తారు. కొలవడమే కాదు గుడి కట్టి మరీ పూజిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో ఉన్న ధర్మారంలో ఉంది ఈ గుడి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఈ కోతి దేవుడు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో రెండు రోజులు జాతర జరుగుతుంది. 40 ఏండ్లుగా పూజలందుకుంటున్న ఈ ఆలయ విశేషాలు. 

ఈ కోతి గుడి వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. కొన్నేండ్ల క్రితం ఒక కోతి ధర్మారం, పీచర గ్రామాల్లోకి వచ్చింది. పొలాల్లో, ఇండ్లల్లో తిరుగుతూ జనాలతో కలిసిపోయింది. ఎవ్వరికీ హానిచేసేది కాదు. ఏమైందో తెలియదు... రెండేండ్ల తర్వాత ఆ కోతి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.

జనాలు కనిపిస్తే చాలు దాడి చేసేది. పంటలను నాశనం చేసేది. అయినా కూడా వాళ్లు దాన్ని ఏమీ అనేవాళ్లు కాదు. ఆంజనేయుడి ప్రతీక అయిన కోతిని కొట్టడం పాపం అనే ఉద్దేశంతో ఆ కోతిని ఊరి నుంచి తరిమేశారు. కానీ, ఆ కోతి మళ్లీ ఊళ్లోకి వచ్చి దారిన పోయేవాళ్లని గాయపర్చేది. దాంతో గ్రామస్తులు ఆ కోతిని చంపి, ఊరి బయట సమాధి చేశారు. 

కలలో వచ్చి... 

కోతిని చంపిన తర్వాత ఆ గ్రామంలోని కొందరి ఆంజనేయుడు ఈఉంది. కొన్నెండ్ల క్రితం భక కోతి ధర్మారం, రూపంలో వచ్చిన ఆంజనేయస్వామిని. నాకు పీచర గ్రామాల్లోకి వచ్చింది. ఆలయం నిర్మించాల'ని చెప్పాడట. దాంతో కోతిని సమాధి చేసిన చోటే పూజలు చేసి, 1978 లో గుడి కట్టించారు. గుడి దగ్గర్లోని కోనేటిలో స్నానం చేస్తే కోరింది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో ఉత్సవం నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లానుంచే కాకుండా కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.