వర్గీకరణ తీర్పు చరిత్రాత్మకం

నెట్​వర్క్, వెలుగు : ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో నేతలు సంబురాలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఎస్సీ వర్గీకరణకు ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అలుపెరుగని పోరాటం చేశామన్నారు.

 నస్పూర్ మున్సిపాలిటీలో  జరిగిన వేడుకల్లో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. ఆదిలాబాద్​పట్టణం, ఖానాపూర్, జన్నారం, భీమారం, ఇచ్చోడ తదిత ప్రాంతాల్లో పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, బట్టి వమందకృష్ణ మాదిగ ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు. అంబేద్కర్​ విగ్రహాలకు నివాళి అర్పించారు.

తీర్పును స్వాగతిస్తున్నాం: ఇంద్రకరణ్ రెడ్డి

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ సమంజసమేనని, ఈ తీర్పును స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లాది మంది దళితుల చిరకాల స్వప్నం నిరవేరబోతుందని హర్షం వ్యక్తం చేశారు.

వలస ఎస్టీలను ఏరివేయాలి

 ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం ఈ తీర్పుతో ఊరటనిచ్చిందని, తీర్పును ఆదివాసీలుగా  స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ సోయం బాపురావు ఒక తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ల కోసం పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడాలను ఎరివేసిన తర్వాతే శాస్త్రీయంగా ఎస్టీ వర్గీకరణ చేపట్టి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.