కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందూ ఐక్యవేదిక ర్యాలీ 

కరీంనగర్ సిటీ, వెలుగు : బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులపై జరుగుతున్న  దాడులను నిరసిస్తూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా చేపట్టారు. వేలాది మంది ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లారు.  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులను కాపాడండి, రక్షించండని ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. అనంతరం   పీఠాధిపతులు, హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించారు.

కార్యక్రమంలో పీఠాధిపతులు శ్రీశ్రీ సనక సనంద స్వామీజీ, పురాణం మహేశ్వరశర్మ, హిందూ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా కన్వీనర్ అనుమండ్ల రాజిరెడ్డి, కో కన్వీనర్లు డా.రమణాచారి, ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిరణ్, పి.కిషన్, కిరణ్ సింగ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్, వెలుగు: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులపై జరుగుతున్న హింసకాండపై ఐక్యరాజ్య సమితి(యూఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో) జోక్యం చేసుకోవాలని హిందూ ఐక్య వేదిక కన్వీనర్ జనపాల శంకరయ్య కోరారు. సిరిసిల్లలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందూవులను ఊచకోత కోస్తూ,  స్త్రీల మాన ప్రాణాలను హరిస్తుంటే ప్రపంచ మానవహక్కుల సంఘం ఏం చేస్తుందని ప్రశ్నించారు. 

జగిత్యాలలో ర్యాలీ 

జగిత్యాల టౌన్, వెలుగు: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందువులపై దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్రీయ హిందూ మహా సంఘటన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానాల కిషన్, కవొష్ణ తదిరులు పాల్గొన్నారు.