పొగమంచులో బైక్​ను ఢీకొట్టిన బస్సు..యువకుడు మృతి

చేవెళ్ల, వెలుగు : మండలంలోని ఎన్కేపల్లిలో శ్రీ సత్య సాయి గ్రామర్ హై స్కూల్  బస్సు ఉదయం  పిల్లలను తీసుకొని  వెళ్తున్న క్రమంలో పొంగమంచులో ఓ బైక్​ను ఢీ కొట్టింది.  బైక్ పై ఉన్న మొండివాగు కు  చెందిన ఇమ్రాన్ (22 ) అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం..ఇమ్రాన్​ పనిమీద మొండివాగు నుంచి ఎన్కేపల్లి గేట్ వైపు వెళ్తుండగా   స్కూల్ బస్సు ఢీకొట్టింది.  

దీంతో అతను చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు  దర్యాప్తు లో ఉంది. మృతడు  ఇమ్రాన్​ కు ఐదు నెలల క్రితం వివాహాం జరిగింది. మృతి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని బంధువులు డిమాండ్​ చేశారు. 

 ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని మరొకరు.. 

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద సాగర్​ రహదారిపై సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సు , బైక్ ను ఢీకొనడంతో  నాగర్ కర్నూల్ జిల్లా చారకొండకు చెందిన కొమ్ము ప్రశాంత్(23) చనిపోయాడు. సీఐ మంచాల మధు తెలిపిన వివరాల ప్రయారం..

ప్రశాంత్​ బైక్​ పై హైదరాబాద్​ వైపు వెళ్తుండగా, అదే సమయంలో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సుశివన్నగూడాకు వెళ్తూ ప్రశాంత్​ను ఢీకొట్టింది. దీంతో ప్రశాంత్​కు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.